Sunday, July 10, 2011

MR.perfect


సాకీ : 
ఎప్పటికీ తన 
గుప్పెట విప్పదు
ఎవ్వరికీ తన 
గుట్టును చెప్పదు
ఎందుకిలా ఎదురైనది 
పొడుపు కథా
తప్పుకునేందుకు దారిని ఇవ్వదు
తప్పు అనేందుకు కారణముండదు
చిక్కులలో పడడం తనకేం సరదా

పల్లవి :
బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా
నిన్న మొన్నా నీ లోపలా కలిగిందా 
ఏనాడైనా కల్లోలం ఇలా
ఈరోజేమైందని ఏదైనా అయ్యిందని
నీకైనా కాస్తయినా అనిపించిందారా ఎప్పటికీ

చరణం : 1 
ఏదోలా చూస్తారే నిన్ను వింతలా
నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంతలా
మునపటిలా లేవంటూ 
కొందరు నిందిస్తూవుంటే
నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా
సంబరపడి నిను చూపిస్తూ 
కొందరు అభినందిస్తుంటే
నవ్వాలో నిట్టూర్చాలో తెలిసేదెలా ॥

చరణం : 2 
నీ తీరే మారింది నిన్నకీ నేటికీ
నీ దారే మళ్లుతోందా కొత్త తీరానికి
మార్పేదైనా వస్తుంటే 
నువ్వది గుర్తించక ముందే
ఎవరెవరో చెబుతూవుంటే నమ్మేదెలా
వెళ్లే మార్గం ముళ్లుంటే ఆ సంగతి గమనించందే
తొందరపడి ముందడుగేసే వీల్లేదెలా బదులు

చిత్రం : Mr.పర్‌ఫెక్ట్ (2011)
రచన : సిరివెన్నెల, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : కార్తీక్, సాకీ : మల్లికార్జున్

No comments:

Post a Comment